ఆ కాలేజీల పై ఇంటర్ బోర్డ్ సీరియస్

-

జీతాలు చెల్లించని, సిబ్బందిని తొలగించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీల మీద ఇంటర్ బోర్డ్ సీరియస్ అయింది. ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డ్ పేర్కొంది. క్వాలిఫైడ్ టీచింగ్ &నాన్ టీచింగ్ స్టాఫ్ అందుబాటులో లేక పోతే 2020- 21 అప్లికేషన్ దరఖాస్తును తిరస్కరిస్తామని హెచ్చరించింది. నిబంధనల మేరకు సిబ్బంది లేక పోతే ఆయా కళాశాలల ఆఫలియేషన్ దరఖాస్తులను తిరస్కరిస్తామని కూడా పేర్కొన్నారు.

రెండేళ్ళ ఇంటర్ మీడియట్ కోర్సును అందిస్తున్న ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, ఒకవేళ అలా నిబంధనలు పాటించని యాజమాన్యానికి తాత్కాలిక గుర్తింపు రద్దు చేయబడుతుందని హెచ్చరించింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ సర్క్యులర్ జారీ చేశారు. పనిదినాలు తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్ సిలబస్ ని తగ్గించాలా ? ఒకవేళ తగ్గిస్తే ఏ పాఠ్యాంశాలను తొలిగించాలి ఎంత మేరకు తగ్గించాలి అనే దానిపై ఇంటర్ బోర్డ్ వేసిన కమిటీలు రిపోర్ట్ ఇవ్వగా వారిని ప్రభుత్వానికి పంపింది ఇంటర్ బోర్డ్.

Read more RELATED
Recommended to you

Latest news