మెదక్ తాజా మాజీ కలెక్టర్ ధర్మారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో ఉంటున్నారు ధర్మారెడ్డి. అయితే పదవీ విరమణ చేసినా ఇంకా మెదక్ లో ప్రభుత్వ బంగ్లాను మాజీ కలెక్టర్ ఖాళీ చేయలేదు. బంగాళా లో పనిచేసే సిబ్బందికి రోజు ఫోన్ చేసేవారని తెలుస్తోంది. అయితే అడిషనల్ కలెక్టర్ వివాదం తర్వాత ధర్మారెడ్డి ఎవరి కాంటాక్ట్ లోకి రాలేదని అంటున్నారు.
ఇక మెదక్ అడిషనల్ కలెక్టర్ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఐదుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన ఏసీబీ అధికారులు, నిందితులను ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరు పరచారు. ఈ ఐదుగిరికీ 14 రోజుల జ్యుడీషియల్ రీమాండ్ విధించింది ఏసీబీ కోర్ట్. దీంతో ఈ నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు.