కేసీఆర్ తలకాయ లేని ముఖ్యమంత్రి : బండి సంజయ్

-

కేసీఆర్ ని తలకాయ లేని ముఖ్యమంత్రిగా అభివర్ణించారు తెలంగాణా బీజేపీ అధ్యక్ష్యుడు బండి సంజయ్. రాబోయే రోజుల్లో కేసీఆర్ కు బీజేపీ దమ్మేంటో చూపిస్తామన్న అయన బీజేపీకి టీఆర్ఎస్ నేతల గుర్తింపు అవసరం లేదని, ప్రజలే కేసీఆర్ ను మర్చిపోతున్నారని అన్నారు. టీఆర్ఎస్ కాదు, ప్రజా స్పందనే మాకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు, నేతలపై పోలీసులతో దాడులు చేయించటాన్ని ఖండిస్తున్నామన్న ఆయన కేసీఆర్ అబద్ధాలకు త్వరలోనే సమాధి కడతామని అన్నారు.

తన కుటుంబానికి చరిత్రలో స్థానం కోసమే విమోచన దినోత్సవాన్ని జరపటంలేదని అన్నారు. అమరుల చరిత్రను తుడిచి వేయటానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నాడని విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని కేసీఆర్ మాట మార్చాడని ఆయన అన్నారు. కేసీఆర్ ఓవైసీ కుటుంబం మోచేతి నీళ్ళు తాగుతున్నాడన్న సంజయ్ రాజసింగ్ కు పార్టీ మద్దతు లేదనటం సరైంది కాదని, రాజసింగ్ సీనియర్ ఎమ్మెల్యే అన్న ఆయన రాజసింగ్ పార్టీకి ఫైటర్ అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news