శుక్రవారం కాంగ్రెస్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కీలక పదవుల నుంచి పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, అంబికా సోనిలను ప్రధాన కార్యదర్శులుగా తొలగించారు. ఇతర నాయకులు మోతీలాల్ వోరా, మల్లికార్జున్ ఖార్గే మరియు లుయిజిన్హో ఫలేరియోలను కూడా వారి పదవుల నుండి తొలగించారు. ఆజాద్ మరియు సోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కొనసాగుతున్నారు.
పార్టీ అధినేత సోనియా గాంధీకి లేఖను రాసిన 23 మంది నాయకులలో ఆజాద్ కూడా ఉన్నారు . అయితే ఆజాద్ ని తప్పించడం వెనుక ప్రధాన కారణం కాంగ్రెస్ లో చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసారని, అందుకు అంబికా సోనీ కూడా సహాయం చేసారని సోనియా భావిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో వారిపై రాహుల్ గాంధీ నేరుగా సీరియస్ అయ్యారు.