సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ తాజాగా నిర్వహించిన తన వర్చువల్ ఈవెంట్‌లో కొత్తగా వాచ్ సిరీస్ 6 వాచ్‌లను, వాచ్ ఎస్ఈ బడ్జెట్ యాపిల్ వాచ్‌ను, 8వ జనరేషన్ ఐప్యాడ్, 4వ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్‌లను లాంచ్ చేసిన విషయం విదితమే. ఇక ఆ కార్యక్రమంలో భాగంగా ఐఓఎస్ 14ను నేడు (బుధవారం) విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈ క్రమంలో పలు డివైస్‌లకు ఐఓఎస్ 14 అప్‌డేట్ నేడు విడుదల కానుంది.
ఐఓఎస్ 14 అప్‌డేట్ పొందనున్న యాపిల్ డివైస్‌ల వివరాలు…
* ఐఫోన్ 11, 11 ప్రొ, 11 ప్రొ మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఎక్స్ఎస్ మ్యాక్స్, ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్
* ఐఫోన్ 8, 8 ప్లస్, 7, 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ ఎస్ఈ 2020
* ఐపాడ్ టచ్ 7వ జనరేషన్
పైన తెలిపిన ఐఫోన్లతోపాటు, ఐపాడ్ టచ్ 7వ జనరేషన్ డివైస్‌లకు ఐఓఎస్ 14 అప్‌డేట్ లభ్యం కానుంది. ఇక ఈ కొత్త ఓఎస్‌లో పలు నూతన ఫీచర్లను అందిస్తున్నారు.
* యాపిల్ డివైస్‌ల స్క్రీన్‌పై స్మార్ట్ స్టాక్ పేరిట విడ్జెట్లను సెట్ చేసుకోవచ్చు. యూజర్లు ఉన్న ప్రదేశం, చేస్తున్న యాక్టివిటీ, నిర్దిష్టమైన సమయంలో ఆ విడ్జెట్లను కనిపించేలా సెట్ చేయవచ్చు.
* డివైస్‌లో ఉన్న యాప్ లైబ్రరీ యాప్‌లన్నింటినీ కేటగిరి వారిగా ఆర్గనైజ్ చేస్తుంది. యూజర్ ఉన్న లొకేషన్, టైం, యాక్టివిటీ ఆధారంగా యాప్స్‌ను సజెస్ట్ చేస్తుంది.
* ఫేస్‌టైం కాల్‌లో ఉన్నప్పుడు యూజర్లు పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ద్వారా వీడియోలను చూడవచ్చు. అందువల్ల కాల్ నుంచి బయటకు వెళ్లాల్సిన పనిలేదు.
* కొత్త అప్‌డేట్‌లో ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను అందిస్తున్నారు. 11 భాషల్లో ట్రాన్స్‌లేషన్ అందుబాటులో ఉంది. ఫోన్‌ను ల్యాండ్ స్కేప్ మోడ్‌లోకి తిప్పి మైక్రోఫోన్ బటన్‌పై ట్యాప్ చేసి అనంతరం ఏదైనా మాట్లాడితే దాన్ని ఇతర భాషలోకి సులభంగా ట్రాన్స్‌లేట్ చేయవచ్చు.
* గ్రూప్ సంభాషణల్లో ఏదైనా మెసేజ్‌కు నేరుగా రిప్లై ఇవ్వవచ్చు. అలాగే పూర్తి సంభాషణల్లోని రిప్లైలను చూడవచ్చు.