5 ఆగస్టు 2019 తరువాత, జమ్మూ & కాశ్మీర్ లో ఉగ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేసారు. 2019 ఆగస్టు 5 కి ముందు 29.06.2018 నుండి 04.08.2019 వరకు 455 సంఘటనలు జరిగాయని అన్నారు. మరియు 2019 ఆగస్టు 5 తర్వాత 05.08.2019 నుండి 09.09.2020 వరకు 211 సంఘటనలు జరిగాయని చెప్పారు.
ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 05.08.2019 నుండి 09.09.2020 మధ్య కాలంలో దేశంలో సరిహద్దు ప్రాంతాల్లో పెద్ద ఉగ్రవాద దాడి జరగలేదని… కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను రద్దు చేసిన తరువాత దేశంలోని మొత్తం ఉగ్రవాద సంఘటనలకు సంబంధించి వేసిన ప్రశ్నలో భాగంగా ఆయన ఈ సమాధానం చెప్పారు. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, డబ్ల్యుబి, రాజస్థాన్, బీహార్, యుపి, ఎంపి & జె & కె: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అత్యంత చురుకుగా ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలిందని అన్నారు.