భారతదేశ ప్రజలకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ శుభవార్త చెప్పింది. రష్యాకు చెందిన స్పుత్‌నిక్-వి కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విక్రయించనుంది. అలాగే ఈ వ్యాక్సిన్‌కు గాను ఆ సంస్థే క్లినికల్ ట్రయల్స్ ను కూడా చేపట్టనుంది. తొలి విడతలో మొత్తం 10 కోట్ల డోసులను డాక్టర్ రెడ్డీస్ ఉత్పత్తి చేయనుంది.
రష్యాలోని గమాలయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రష్యా రక్షణ విభాగం కలిసి సంయుక్తంగా స్పుత్‌నిక్-వి వ్యాక్సిన్‌ను రూపొందించిన విషయం విదితమే. ఈ వ్యాక్సిన్‌కు గాను రష్యాలో ప్రస్తుతం ఓ వైపు ఫేజ్ 3 ట్రయల్స్ కొనసాగుతున్నాయి. మరో వైపు వ్యాక్సిన్‌ను అక్కడ ప్రజలకు పంపిణీ కూడా చేస్తున్నారు. అయితే ఆ వ్యాక్సిన్‌ను ఇకపై భారత్‌లోనూ సరఫరా చేయనున్నారు.
రష్యా స్పుత్‌నిక్ వ్యాక్సిన్ తయారీదారు ఆర్‌డీఐఎఫ్ ఈ మేరకు డాక్టర్ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఆ వ్యాక్సిన్‌ను భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ సరఫరా చేయనుంది. అయితే ఈ వ్యాక్సిన్‌కు భారత్‌లో ఎప్పటి నుంచి ట్రయల్స్ చేపడుతారు, ఎప్పుడు వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తారన్న వివరాలు ఇంకా తెలియలేదు.