టిక్ టాక్ కథ సమాప్తం.. ఆ దేశంలో కూడా..?

-

టిక్ టాక్ కథ సమాప్తం అయ్యింది. ప్రస్తుతం ఎట్టకేలకు టిక్టాక్ మూసివేసే పరిస్థితి వచ్చింది. ఏకంగా చైనానే టిక్ టాక్ కి స్వయంగా ఉరి వేసింది. భారత్ లో నిషేధం తర్వాత అమెరికా కూడా టిక్ టాక్ ని బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. టిక్ టాక్ అమెరికా యాజమాన్య హక్కులను స్థానిక సంస్థలకు విక్రయిస్తే అమెరికాలో అనుమతిస్తాము అంటూ నిబంధన పెట్టింది. టిక్ టాక్ యాజమాన్యపు హక్కు లను అమెరికాకు విక్రయిస్తే అమెరికా ముందు తలవంచినట్లు అవుతుందని భావించిన చైనా ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో చర్చలు జరిగినప్పటికీ అవి అసంతృప్తిగానే ముగిసిపోయాయి.

ఈ నేపథ్యంలో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుని టిక్ టాక్ ను అమెరికాలో పూర్తిస్థాయిలో బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వినియోగదారులకు సంబంధించిన కీలక సమాచారం తస్కరణ కు గురయ్యే అవకాశం ఉంది అనే ఆరోపణతో టిక్ టాక్ బ్యాన్ చేసింది. ఈనెల 20వ తేదీ నుంచి అమెరికా లో టిక్ టాక్ యాప్ పూర్తిగా బ్యాన్ కానుంది. ఇప్పటికే అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి టిక్ టాక్ యాప్ ను తొలగించాలని ఉత్తర్వులు కూడా జారీ చేసింది అమెరికా ప్రభుత్వం. టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన వుయ్ చాట్ ను కూడా బ్యాన్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news