పోర్న్ స్టార్’ అనే కామెంట్స్ పై స్పందించిన ఊర్మిళ.. ఏమన్నారో తెలుసా..?

మామూలుగానే బాలీవుడ్ లో తన వ్యాఖ్యలతో ఎన్నో వివాదాలు సృష్టించి కాంట్రవర్షియల్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. సుశాంత్ ఆత్మ హత్య తర్వాత బాలీవుడ్ సినీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ మరింత ఘాటుగా కామెంట్ చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు రాజకీయంగా కూడా తన వ్యాఖ్యలతో ఎన్నో వివాదాలకు తెరలేపింది. ఇటీవలే సినీనటి ఊర్మిళ ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నటి ఊర్మిలా కేవలం పోర్న్ స్టార్ గా మాత్రమే గుర్తింపు సంపాదించిందని ఆమెకు నటన రాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా.

అయితే ఇటీవల దీనిపై స్పందించిన నటి ఊర్మిళ… కంగనా వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చింది. కంగనా తప్పుడు విమర్శలు చేయగానే ఎంతోమంది సిని ప్రముఖులు నెటిజన్లు కంగనాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ తనకు అండగా నిలబడ్డారని.. మీడియో కూడా కూడా తనకే మద్దతు ప్రకటించింది అంటూ తెలిపిన ఊర్మిళ… వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతేకాదు కంగనా బీజేపీ నుంచి టిక్కెట్ ఆశించడం కారణంగానే… ఇలా మహారాష్ట్ర ప్రభుత్వంపై ముంబై నగరం పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది అంటూ ఊర్మిళ కౌంటర్ ఇచ్చింది . అయితే కంగనా కామెంట్లపై వ్యతిరేకతను వ్యక్తం చేసి.. మీరు చూపించిన అభిమానం ప్రేమ కు ధన్యవాదాలు ధన్యవాదాలు అంటూ ఒక ట్వీట్ చేశారు ఉర్మిళ.