ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 టోర్నీకి వేళైంది. దేశంలో ఎక్కడ చూసినా ఐపీఎల్ ఫీవర్ నెలకొంది. ఫ్యాన్స్ అందరూ తొలి మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈసారి ఫ్యాన్స్ అందరూ టీవీల్లో లేదా ఆన్‌లైన్‌లోనే ఐపీఎల్‌ను చూడాలి. దీంతో ఈసారి రేటింగ్స్ కూడా భారీగా వస్తాయని ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఐపీఎల్ కు చెందిన అన్ని జట్లలోనూ టాప్ ప్లేయర్లందరూ దాదాపుగా అందుబాటులో ఉన్నారు. ఆయా ప్లేయర్లకు ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే అన్ని జట్లలోనూ కలిపి మొత్తం అందుబాటులో ఉన్న టాప్ 10 పెయిడ్ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు ఒక లుక్కేద్దాం.
* ఐపీఎల్ 2020 టోర్నీకి గాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అందరి కన్నా ఎక్కువగా ఏకంగా రూ.17 కోట్ల మొత్తం అందుకుంటున్నాడు.
* కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టకు చెందిన ఆస్ట్రేలియా బౌలర్ ప్యాట్ కమిన్స్‌కు ఆ జట్టు యాజమాన్యం రూ.15.50 కోట్లు చెల్లిస్తోంది.
* చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రిషబ్ పంత్‌లకు ఒక్కొక్కరికి ఆయా జట్లు రూ.15 కోట్లు ఇస్తున్నాయి.
* సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు రూ.12.50 కోట్ల పేమెంట్ ఇస్తోంది.
* రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్, రాజస్థాన్ ప్లేయర్ బెన్ స్టోక్స్ లకు ఒక్కొక్కరికి ఆయా ఫ్రాంచైజీలు రూ.12.50 కోట్లు ఇస్తున్నాయి.
* బెంగళూరు జట్టు ప్లేయర్ ఏబీ డివిలియర్స్‌కు ఆ జట్టు యాజమాన్యం రూ.11 కోట్లు ఇస్తోంది.