వొడాఫోన్ ఐడియా (వీఐ) నుంచి నూత‌న ప్రీపెయిడ్ ప్లాన్లు.. జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫ్రీ..

-

వీఐ (వొడాఫోన్ ఐడియా) ప‌లు నూత‌న ప్లాన్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. వీటికి జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా అందిస్తున్నారు. రూ.355 మొద‌లుకొని ఈ ప్లాన్లు ప్రారంభ‌మ‌వుతున్నాయి. ఈ ప్లాన్ల‌కు రూ.699 విలువ‌గ‌ల ఏడాది కాల వ్య‌వ‌ధి ఉన్న జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా అందిస్తారు. ఈ ప్లాన్ల ద్వారా ఉచిత డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొంద‌వ‌చ్చు.

vodafone idea launches new prepaid plans which gives free zee5 premium subscription

వీఐకి చెందిన రూ.355, రూ.405, రూ.595, రూ.795, రూ.2595 ప్లాన్ల‌ను రీచార్జి చేసుకోవ‌డం ద్వారా జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ను పొంద‌వ‌చ్చు.

* రూ.355 ప్లాన్‌లో వాయిస్ కాల్స్ రావు. 50జీబీ ఉచిత డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.
* రూ.405 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వ‌స్తాయి. 90 జీబీ డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీని కూడా 28 రోజులుగా నిర్ణ‌యించారు.
* రూ.595 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వ‌స్తాయి. రోజుకు 2జీబీ డేటా ల‌భిస్తుంది. దీని వాలిడిటీ 56 రోజులుగా ఉంది.
* రూ.795 ప్లాన్‌లోనూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వ‌స్తాయి. రోజుకు 2జీబీ డేటా వాడుకోవ‌చ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది.
* రూ.2595 ప్లాన్‌లోనూ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ల‌భిస్తాయి. రోజుకు 2జీబీ ఉచిత డేటా ల‌భిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులుగా ఉంది.

వినియోగ‌దారులు పైన తెలిపిన ప్లాన్ల‌లో దేన్న‌యినా రీచార్జి చేసుకున్న అనంత‌రం జీ5 ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. అయితే ఆ స‌బ్‌స్క్రిప్ష‌న్ 12 నెల‌ల పాటు ఉచితంగా కొన‌సాగాలంటే వినియోగ‌దారులు నెల‌కు క‌నీసం రూ.219 లేదా అంత‌క‌న్నా ఎక్కువ ఖ‌రీదు ఉన్న‌ ప్లాన్‌ను రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news