తెలుగు సినిమా పాటలు బాల బాలసుబ్రహ్మణ్యం లేకుండా ఊహించుకోగలమా? టాలీవుడ్ లో ఉన్న ప్రతీ స్టార్ హీరోకి లెక్కలేనన్ని హిట్ పాటలు ఇచ్చిన ఘనత బాలు సొంతం! ప్రతీ స్టేజ్ పైనా బాలుని తెగపొగిడేసిన టాలీవుడ్ జనాలు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆయన చేసిన కీర్తిని ఇంతకాలం తెగపొగిడేశారు! కానీ… చనిపోతే మాత్రం చివరిచూపుకు ఎందుకు వెళ్లలేదు?
ప్రస్తుతం ఆన్ లైన్ వేదికగా చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది! బాలు అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరుపున ఒక మంత్రి, తమిళనాడు ప్రభుత్వం తరుపున మరో మంత్రి హాజరయ్యారు. ప్రభుత్వ లాంచనాలతో బాలు అంత్యక్రియలు జరిగాయి. అభిమానులు కూడా హాజరయ్యారు! తమిళ సినీ జనాలు కూడా కాస్తో కూస్తో వచ్చి.. బాలూని చివరిచూపు చూసుకున్నారు! ఆన్ లైన్ లో కనీరు మున్నీరైపోయిన టాలీవుడ్ జనాలు ఎందుకు వెళ్లలేదు!
కరోనా అంటే భయం ఉండి ఉండొచ్చు. దానికి కూడా కాస్త లిమిట్ ఉంటుంది కదా!! కరోనా ఉందని ఏ పనులు మానుకున్నారు? మహా అయితే షూటింగులు తప్ప!! కాస్త జాగ్రత్తలు తీసుకుని వెళ్లి, కడసారి చూపుచూసుకుని, ఒక పూలదండవేసి వస్తే వచ్చిన నష్టం ఏమిటి? బాలుపై ఉన్న అభిమానాన్ని కరోనా కట్టిపడేసిందా? లేక సినిమా వాళ్లకు సినిమావాళ్లపై ఇంతకు మించిన అభిమానాన్ని ఆశించడం బాలు అభిమానుల తప్పా?
కారణం అయితే కరోనా అయ్యి ఉండొచ్చు.. ఈ కరోనా కాలంలో ఎవరూ ఎక్కడికీ ప్రయాణాలు చేయలేదా? గడపదాటి బయటకు రావడం లేదా? పాపం బాలూని టాలివుడ్ అలా పంపేసింది!! సారీ బాలు గారు… మా టాలీవుడ్ తపురున క్షమాపణలతో – ఒక తెలుగు సినిమా అభిమాని!!
-CH Raja