తమిళనాడు ప్రభుత్వం వివాదాస్పద రైతు బిల్లులకు మద్దతు ప్రకాడించిన విషయం తెలిసిందే. అయితే ఇలా మద్దుతు ప్రకటించాడన్ని ప్రముఖ సినీ నటుడు,రాజకీయవేత కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు. ఇలా మద్దతు ప్రకటించడం రైతులకు తీవ్ర ద్రోహం చేయడమే అని అన్నారు .ఇలాంటి బిల్లులు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల ధరలు మరింత పెరిగిపోయి ఈ ప్రభుత్వం ఏమీ చేయలేక చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్ఛరించారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వీటిని పార్లమెంటుకు తిప్పి పంపాలని, వీటిపై సభలో చర్చ జరిగితేనే రైతులకు కొంతయినా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.నేను ఒక రైతునే అని చెప్పుకునే ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ బిల్లులకు ఎలా ఆమోదిస్తున్నారని కమల్ హాసన్ ప్రశ్నించారు. తమిళనాడులో వచ్చే సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో అన్నదాతలు ఈ ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఖాయం అని ఆయన అన్నారు.అయన ఈ బిల్లును ఆమోదించడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ బిల్లుల తాలూకు ప్రతులను చించి పారేసారు.. !మరి దీనిపై తమిళనాడు ప్రభుత్వం ఇలా స్పందిస్తుందో చూడాలి.. !!