బాబ్రీ మసీదు తీర్పు.. కాంగ్రెస్ ఏమందో తెలుసా..?

-

గత 28 సంవత్సరాల నుంచి కోర్టులో వాయిదా పడుతూ వస్తున్న బాబ్రీ మసీదు కేసు ఎట్టకేలకు కోర్టు తీర్పుతో సుఖాంతం అయ్యింది. ఈరోజు ప్రత్యేక కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సంచలన తీర్పును వెలువరించింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరూ నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ మేరకు రెండు వేల పేజీల తీర్పును వెలువరించారు న్యాయమూర్తి ఎస్ కె యాదవ్.

babri masid

అయితే బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వెలువడిన తీర్పుపై తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే న్యాయస్థానం వెలువరించిన తీర్పు పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అంటూ కాంగ్రెస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ ఓ ప్రకటన విడుదల చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత చట్ట వ్యతిరేకమైన చర్య అని… ఈ కేసు తీర్పు విషయంలో న్యాయస్థానం అసాధారణమైన ఉల్లంఘనకు గురి అయింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. గతంలో సుప్రీంకోర్టు తీర్పుకు ప్రస్తుత న్యాయస్థానం తీర్పు పూర్తిగా విరుద్ధంగా ఉంది అంటూ తెలిపారు ఆయన.

Read more RELATED
Recommended to you

Latest news