బన్ని, నాని భలే తప్పించుకున్నారు

-

శ్రీను వైట్ల డైరక్షన్ లో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన సినిమా అమర్ అక్బర్ ఆంటోని. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డది. రొటీన్ కథను రొటీన్ స్క్రీన్ ప్లేతో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోని చూసిన ఆడియెన్స్ పెదవి విరిచారు.

అయితే ఈ సినిమా కథ మొదట అల్లు అర్జున్, నానిల దగ్గరకు వెళ్లిందట. మిస్టర్ తర్వాత శ్రీను వైట్ల అల్లు అర్జున్ కు ఈ కథ వినిపించగా అతని వద్దనేశాడట. ఆ తర్వాత శ్రీను వైట్ల నానికి ఈ కథ చెప్పాడట నాని కూడా నచ్చలేదని చెప్పడంతో రవితేజతో ఈ సినిమా చేశాడు శ్రీను వైట్ల. అయితే సినిమా ట్రైలర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా సినిమా మాత్రం అంచనాలను అందుకోలేదు. మరి రిజల్ట్ చూశాక సినిమా కాదన్నందుకు బన్ని, నానిలు హమ్మయ్య అనుకున్నారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news