కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలం రొయ్యురు వద్ద ఏటిలో 5 గురు గల్లంతయ్యారు. వరద ప్రవాహం ఎక్కవ వుండడంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. ఆ ఐదుగురు యువకులు ఆచూకీ కోసం ఫైర్, పోలీసు శాఖల అధికారులు రంగం లోకి దిగారు. ఈ 5 గురుది కంకిపాడు మండల వైకుంటపురం అని తెలుస్తోంది. వీరు అందరూ చేపలు కోసమే కృష్ణా నదిలోకి వెళ్లారని తెలుస్తోంది.
వరద ఉధృతికి యువకులు కొట్టుకు పోగా, ఒక వ్యక్తి ఈదుకుంటూ బయటికి వచ్చాడు. అందులో నలుగురు గల్లంతయ్యారు. అయితే ఓ వ్యక్తి మృత దేహం లభ్యం కాగా మరో ముగ్గురు కోసం గాలిస్తున్నారు. గల్లంతయిన 3 ముగ్గురి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. గాలింపు చర్యలు కోసం రంగంలోకి ఎన్.డి.ఆర్.ఫ్,ఎస్.డి.ఆర్.ఫ్, పోలీసులు బృందాలు దిగాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నదిలో మరింత ముందుకు కొట్టుకు పోయే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.