బీహార్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. అసలు నితీష్ కుమార్ బీహార్ కి తర్వాతి సిఎం అయ్యే అవకాశం ఉందా…? ఏమో చెప్పలేమనే అంటుంది జాతీయ మీడియా. లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) బీహార్ లో భారతీయ జనతా పార్టీ రహస్య ఆయుధంగా మారగలదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యుడైన హోంమంత్రి అమిత్ షా, అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) -బిజెపి సంకీర్ణ నాయకుడిగా ప్రకటించారు. కాని అక్కడి బిజెపి నాయకులు చాలా మంది నితీష్ ని ఒప్పుకోవడం లేదని తెలుస్తుంది. నితీష్ కుమార్ తో కలిసి వెళ్ళేది లేదని ఎల్జెపి చెప్తుంది. కాబట్టి ఒంటరిగా పోటీ చేయడం లేదా బిజెపి అభ్యర్ధులు ఉన్న చోట పోటీ నిలబెట్టకపోవడం చేస్తుంది. తద్వారా ఓట్లు చీల్చి బిజెపికి మేలు చేసి జేడియుకి తక్కువ సీట్లు తెచ్చి ఎల్జేపీ కీలక పాత్ర పోషిస్తే సిఎం సీటు ఆ పార్టీకి ఇవ్వొచ్చు లేదా బిజెపి తీసుకోవచ్చు.