కరోనా వైరస్ విస్తరణ పెరిగింది కాబట్టి మనం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి వాతావరణం, తినే చల్లటి వస్తువులకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏసీ వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. ఏసీలు వాడే ప్రతీ ఒక్కరు కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాలి. అసలు ఏసీ ఎందుకు వాడకూడదనేది నిపుణులు చెప్పే మాట ప్రకారం…
ఏసీ వలన గాలి అంతా ఒక గదిలో కేంద్రీ కృతమై ఉంటుంది. అంటే గాలి ఆ గదిలోనే ప్రసరిస్తుంది. గదిలో ఉన్న అద్దాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీవీలకు, గ్లాసులకు ఇతరత్రా ఎలక్ట్రానిక్ గ్యాడ్జేట్స్ కు అది సులువుగా పట్టేస్తుంది. కాబట్టి 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల వరకు మాత్రమే ఏసీ ఉంచుకోవాలి. వాతావరణం బయట చల్లగా ఉంటే తలుపు తీసి ఫ్యాన్ మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. సీలింగ్ ఫ్యాన్ చాలా మంచిది.