పోలీస్ ఫ్యాన్స్: బాబువి “ప్రతిపక్ష నాయకా పతివ్రతా” కబుర్లు!!

-

వృద్ధనారీ పతివ్రత అనొచ్చో లేదో తెలియదు కానీ.. ప్రతిపక్ష నాయకా పతివ్రతా.. అనే సామెత చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు పోలీస్ ఫ్యాన్స్! అవును… అధికారంలో ఉన్నన్నాళ్లు పోలీసులను ఎలా వాడాలో అలా వాడేసి, దౌర్జనాలకు, సెక్స్ ర్యాకెట్లకు, దుర్మార్ఘాలకు, మహిళా అధికారులపై దాడులు చేసినవారిని రక్షించడానికి వాడేసిన చంద్రబాబు… నేడు ఏపీ డీజీపీకి తనదైన ప్రాతివత్యాన్ని చూపిస్తూ లేఖ రాయడంపై ఇలా స్పందిస్తున్నారు!!

అవును… అసలు పోలీసులు ఎలా ఉండాలి? ఏ విధంగా పని చేయాలి? ఒత్తిళ్లకు లొంగకుండా ఎలా ఉండాలి? విధులు ఎలా నిర్వర్తించాలి? మొదలైన విషయాలపై సూచనలు చేస్తూ.. ఏపీ డీజీపీ సవాంగ్ ‌కి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా.. పోలీసులపై ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు.. ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా.. ఏవిధమైన భయం లేకుండా.. నిష్పాక్షికంగా పోలీసులు విధులు నిర్వర్తించాలి అని పేర్కొన్నారు!

దీంతో ఏపీ పోలీస్ ఫ్యాన్స్ ఆన్ లైన్ లో పనిపెట్టుకున్నారు! ఎన్నో ప్రశాంతమైన ఉద్యోగాలున్నప్పటికీ.. చిన్నప్పటి నుంచీ సామాజిక బాధ్యతతో కలలుగంటూ పెద్దయ్యాక ఈ వృత్తి లోకి వస్తారు! వారి పని వారిని సక్రమంగా చేసుకోనిస్తే… టీడీపీ హయాంలోని కాల్ మనీ సెక్స్ రేకెట్ నిందులను ఎప్పుడో కటకటాల్లోకి పంపించేవారంటూ కామెంట్ చేస్తున్నారు!

పోలీసులపై ఒత్తిళ్లు తేనిపక్షంలో, నిష్పాక్షికంగా విధులు నిర్వహించనిస్తే.. మహిళా అధికారులపై దురుసుగా ప్రవర్తించిన చింతమనేని ప్రభాకర్ వంటి వారికి సరదా తీర్చేసేవారు! మహిళలపై దాడులు.. కాలేజీ హాస్టల్స్ లోని అమ్మయిలపై అత్యాచారాలు.. గుంటూరు జిల్లాలో కొందరు నేతలు చేసిన సెటిల్ మెంట్లు.. వసూళ్ చేసిన ట్యాక్స్ లు… అన్నింటిపైనా చర్యలు తీసుకునేవారు!

కానీ… రాజకీయ నాయకులు అనబడేవారు పోలీసులను వారి పని వారిని చేసుకోనిస్తే కదా! చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఘోరాలు, మరెన్ని నేరాలు! అయినా పోలీసులను ఉత్సవ విగ్రహాలను చేశారు.. నేడు ఒత్తిళ్లకు లొంగొందని చెబుతున్నారు! పోలీసులను వ్యక్తిగత కక్షసాధింపులకు వాడుకున్నారు.. వైకాపా ఎంపీ నందిగామ సురేష్ ఇందుకు సజీవ సాక్ష్యం! ఇప్పుడేమో పోలీసులు నిష్పాక్షికంగా విధులు నిర్వర్తించాలని సూచిస్తున్నారు! ఇదేనేమో… ప్రతిపక్ష నాయకా పతివ్రతా అంటే!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news