తాడికొండ మీదే ఆ ఎంపీ గారి ఫోకసంతా…!

-

అమరావతి భూ సమీకరణ సమయంలో జగన్ ఆదేశాలు మేరకు పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు.దీంతో అదే ఆయనకు పార్టిలో ప్లస్ అయ్యింది..దీంతో పార్టీ అధినేత జగన్ నందిగాం సురేష్ కు ఏకంగా బాపట్ల ఎంపీ సీటు కేటాయించారు. బాపట్ల ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ నియోజకవర్గం ప్రజలు సురేష్ కు అండగా నిలిచారు. భారీ మెజారిటీ ఎంపీగా గెలిపించారు. జగన్ కూడా ఎంపీ సురేష్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

సీఎం జగన్ కు దగ్గర మనిషి గా ఉన్న వ్యక్తి తమ ప్రాంతానికి ఎంపీగా ఉన్నాడని బాపట్ల నియోజకవర్గ ప్రజలు సంతోషించారు కూడ. అయితే ఎంపీ మాత్రం నియోజకవర్గానికి నల్లపూస అయ్యారు. బాపట్ల పార్లమెంట్ పరిధి లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ ఆయన మాత్రం నియోజకవర్గం పై మాత్రం కన్నెత్తి కూడా చూడటం లేదని స్దానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. సాదారణ రోజుల్లో కాదు కదా కానీసం నియోజకవర్గంలోని రైతులు కష్టాలలో ఉన్న సమయంలో కూడా కన్నెత్తి కూడా చూడటం లేదని స్దానికంగా అసంతృప్తికి కారణః అవుతుంది.

వైసిపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల బాపట్ల పార్లమెంట్ పరిధి లోని బాపట్ల , వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలో పలు ప్రాంతాలు నీట మునిగాయి.వేలాది ఎకరాల పంటకు నష్టం వాటిల్లింది. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్న సమయంలో కూడా ఎంపీ కనీసం పరామర్శకు లేకపోవడం పై స్దానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ నందిగం సురేష్ పార్లమెంటు సమావేశాలు మినహా నిత్యం తాడేపల్లి లోని సీఎం క్యాంప్ ఆఫీస్, పార్టీ కార్యాలయం వద్దనే మకాం పెడతారని, పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండే తాడేపల్లి ప్రాంతంలో తన నియోజకవర్గం 30,40 కిలోమీటర్ల దూరం లోనే ఉన్నప్పటికీ, కష్టాల్లో ప్రజలను పరామర్శించే తీరిక లేకుండా పోతుందని విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇక తన స్వగ్రామం ఉన్న తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం లో తిరుగుతూ ఉన్నారు. తన నియోజకవర్గం వదిలేసి తాడికొండ నియోజకవర్గ రాజకీయాలలో వేలు పెట్టడం పై స్దావిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తో రాజకీయ విభేదాలు కూడా పొడచూపాయి.ఒకనోక సందర్భంలో ఉండవల్లి శ్రీదేవి తీవ్ర స్థాయిలో నందిగం సురేష్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు.అయితే ఆ తరువాత ఎమ్మెల్యే శ్రీదేవి స్వయంగా సురేష్ తో రాజీ కుదుర్చుకోవటంతో ఇక పూర్తిగా లైన్ క్లియర్ అయ్యిందని భావిస్తున్నారంట.

Read more RELATED
Recommended to you

Latest news