రమ్యక్రిష్ణ హీరోయిన్‌గా రిటైర్ అయి చాలా ఏళ్లు అవుతోంది. పైగా అమ్మ పాత్రల స్టేజ్‌కి వచ్చేసింది. అయినా ఈమె క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. శివగామి సినిమాలో ఉంటే అదొక బలం అని నమ్ముతున్నారు దర్శకనిర్మాతలు. దీంతో రోజురోజుకి రమ్యక్రిష్ణకి డిమాండ్ పెరిగిపోతోంది.
‘బాహుబలి’ తర్వాత రమ్యక్రిష్ణ ఇమేజ్ ఒక రేంజ్‌కి వెళ్లింది. ఈమెని అంతా శివగామిలా చూస్తున్నారు. ఇక రమ్య కూడా ఈ ఇమేజ్‌కి తగ్గట్లుగానే పవర్‌ఫుల్ రోల్స్ ప్లే చేస్తోంది. అలాగే రెమ్యూనరేషన్‌ని కూడా ఈ లెవల్‌లోనే తీసుకుంటోంది. 50ఏళ్ల వయసులోనూ యంగ్‌బ్యూటీస్‌ని కూడా డామినేట్ చేస్తూ, కొత్త అధ్యాయం మొదలుపెట్టింది.
రోజుకి 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తోందట రమ్యక్రిష్ణ. అంటే ఒక సినిమాలో పది రోజులు పని చేస్తే శివగామి కోటి వరకు తీసుకుంటుంది. రమ్యక్రిష్ణ ఇప్పుడు విజయ్ దేవరకొండ ‘ఫైటర్’తో పాటు, సాయితేజ్-దేవకట్టా పొలిటికల్ థ్రిల్లర్‌లోనూ నటిస్తోంది. ఈ సినిమాలకు రమ్యక్రిష్ణ కోటి రూపాయల వరకు ఛార్జ్ చేస్తోందట.ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో ఉన్న రష్మిక మందన్న లాంటి వాళ్లు కోటిన్నర రేంజ్‌లోనే ఉన్నారు. సో ఈ లెక్కలో చూస్తే రమ్యక్రిష్ణ యంగ్ బ్యూటీస్‌ని కూడా డామినేట్ చేస్తోందని చెప్పొచ్చు.