ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు…!

-

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ హిస్టరీ క్రియేట్‌ చేశాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 50సార్లు 50కి పైగా స్కోర్ సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. పంజాబ్‌తో జరగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు వార్నర్‌.

2009 నుంచీ ఈ మెగా టీ20 లీగ్‌ ఆడుతున్న వార్నర్‌ ఇప్పటికే మూడు సార్లు ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. అంటే ఈ లీగ్‌లో మూడు సార్లు అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2018లో బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని ఏడాది పాటు ఆటకు దూరమవ్వగా ఆ ఒక్క సీజన్‌లో మాత్రమే ఆడలేదు. గతేడాది నిషేధం పూర్తి చేసుకున్న తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వచ్చీ రాగానే 12 మ్యాచ్‌ల్లో 692 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్య పరిచాడు.

వార్నర్‌ 132 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, తర్వాతి స్థానంలో బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ 174 ఇన్నింగ్స్‌ల్లో 42 సార్లు 50కి పైగా పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ప్లేయర్‌ వార్నర్‌ అని…ఈ గణంకాలు చూస్తేనే అర్ధమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news