కరోనా సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. అనుకోకుండా వచ్చిన ఈ ఉపద్రవాన్ని తట్టుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉపద్రవం వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అందుకే ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నారు. ఎదుర్కొంటున్నారు. కరోనా వల్ల పెటుకున్న లాక్డౌన్ వల్ల ఎంతో మంది జీవితాలు తల్లకిందులైపోయాయి. భవిష్యత్తు మీద ఆశతో చేసుకున్న అప్పులన్నీ భారంగా తయారయ్యాయి. కేవలం సామాన్యుల విషయంలోనే కాదు, ప్రతీ ఒక్కరూ ఇలాంటి పరిస్థిని అనుభవించారు.
తాజాగా జబర్దస్త్ నటుడు అవినాష్ ఈ విషయమై తన బాధని బిగ్ బాస్ ద్వారా అందరితో పంచుకున్నాడు. కరోనా తెచ్చిన లాక్డౌన్ వల్ల కొత్తగా తీసుకున్న ఇల్లు ఈఎమ్ ఐ కట్టలేకపోవడం మొదలగు సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. తనదైన హాస్యంతో అందరికీ నవ్వు తెప్పించే అవినాష్ జీవితంలో ఇంతటి విషాదం ఉంటుందని ఎవ్వరూ అనుకోలేదు.