ఆ టార్గెట్ అంత ఈజీ కాదు: స్మిత్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్రుష్టం కాస్త భిన్నంగా ఉంది. రెండు బ్యాక్-టు-బ్యాక్ విజయాలతో దూకుడుగా మారిన ప్రయాణంలో శుక్రవారం వరుసగా నాల్గవ ఓటమిని ఎదుర్కొన్నారు. ఢిల్లీ మీద 46 పరుగుల తేడాతో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఏడవ స్థానానికి పడిపోయారు. స్మిత్ మరియు సంజు సామ్సన్ నేతృత్వంలోని బ్యాటింగ్ విభాగం మొదటి రెండు మ్యాచుల్లో మినహా ఆ తర్వాత ఆడలేదు.

138 పరుగులకు ఆలౌట్ అయింది టీం. దీనిపై స్పందించిన స్మిత్… “చేజ్ సమయంలో, మేము ఎక్కువగా వికెట్లు కోల్పోయాము, నేను అవుట్ అయ్యాను, మేము క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూనే ఉన్నాం. ఈ వికెట్ మీద 180 పరుగులు చేధించడం అంత ఈజీ కాదు. మేము అందరం మంచి భాగస్వామ్యం నెలకొల్పాలి. కాని మేము అలా చేయలేకపోయాము అని స్మిత్ వివరణ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news