16 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బాలిక!

-

16 ఏళ్లకే ఓ బాలిక దేశ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. ఈ నెల 11న ‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’ సంధర్భంగా దక్షిణ ఫిన్లాండ్‌లోని వాక్సే గ్రామానికి చెందిన ఆవా ముర్టో అనే బాలిక ఒక్కరోజు ప్రధాన మంత్రిగా బాధ్యతలను చేపట్టింది..ఆ వేడుకను పురస్కరించుకుని ఐరాస బుధవారం ‘గర్ల్స్‌ టేకోవర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే కేబినెట్‌ మంత్రులు, చట్ట సభ్యులు, అధికారులతో సమావేశాన్ని నిర్వహించింది. బాలికలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడం చాలా ముఖ్యమని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన అవసరముందని నొక్కి చెప్పింది. సాంకేతికంగా దూసుకెళ్తున్న ఫిన్లాండ్‌ బాలికలకు ఆ ఫలాలను అందించేందుకు ఏమేం చేయగలదన్న విషయంపై ఆరా కూడా తీసింది.
స్త్రీ-పురుష సమానత్వ భావనను చాటడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముర్టో తోపాటు అసలు ప్రధాని సనా మారిన్‌ కూడా కేబినెట్‌ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వారిద్దరూ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. ”ప్రపంచ వ్యాప్తంగా బాలికలకు ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి దీనికి పరిష్కారం కనుగొనాలి” అని వారు పేర్కొన్నారు. ఫిన్లాండ్‌లోని చాలా సంస్థలు కూడా మహిళా సిబ్బందికి ఒక్కరోజు సారథ్య బాధ్యతలు అప్పగించాయి.”సాంకేతిక పరిజ్ఞానాన్ని బాలికలకు అందించకుండా మరియు అభివృద్ధి చేయకుండా బాలికలను దూరం పెట్టినంతవరకూ లింగ సమానత్వ ఆశయాలు పెరగకపోగ అది ఇంకా తగ్గుతుందని, బాలికలకు కూడా డిజిటల్ భవిష్యత్తు ఉందని, అందుకే అమ్మాయిలకు టెక్నాలజీ రంగాల్లో ప్రధాన్యత ఉండాలి ”అని ముర్టో అన్నారు..ఈ రోజుకు గుర్తుగా ఫిన్నిష్ ప్రభుత్వం ముర్టో ప్రసంగాన్ని తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించింది.మహిళల హక్కుల విషయంలో ఫిన్లాండ్ అగ్రస్థానంలో ఉంటుంది. మహిళలందరికీ ఓటు వేయడానికి చట్టపరమైన హక్కులు,పౌరహక్కులు ఉన్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో ఫిన్లాండ్ ఒకటి.

Read more RELATED
Recommended to you

Latest news