నవరాత్రుల్లో నిబంధనలతో బెజవాడ దుర్గమ్మ దర్శనం..

-

దసరా నవరాత్రుల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మ దర్శనాలకు పరిమితి విధించారు అధికారులు. కరోనా కారణంగా రోజుకు పదివేల మందిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉత్సవాల సందర్భంగా ముందస్తుగా టికెట్లు తీసుకున్న వారికే దర్శనాలను అనుమతించనున్నారు. మూల నక్షత్రం రోజున 13 వేల మందికి అనుమతి ఉంటుందని తెలిపారు అధికారులు. పదేళ్ల లోపు చిన్నారులు, 60ఏళ్లు పైబడిన పెద్దవాళ్లకు అనుమతి లేదన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని చెప్పారు.

కరోనా తీవ్రతతో దేవాలయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం, లోపల, క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్ల దగ్గర ప్రత్యేకంగా శానిటైజ్ చేయిస్తున్నారు. భక్తులకు అందుబాటులో ఉంచేందుకు కనకదుర్గ నగరంలో ఆరు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనాతో కృష్ణానదిలో పుణ్యస్నానాలకు అనుమతి లేదన్నారు అధికారులు. కేశఖండనలు, అన్నదానాలు కూడా ఉండవన్నారు. ఈసారి దేవస్థానం తరుపున భవాని మాలవిరమన ఏర్పాట్లు ఉండవని భవానీలు అయిన సరే ఆన్‌లైన్‌ టికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news