ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీనితో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి పలు ఆదేశాలు జారీ చేసారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి ఆళ్ల నాని…
లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందుగానే అన్ని ప్రాంతాల్లో మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక తమ్మిలేరుకు పెరుగుతున్న వరద ఉదృతి కారణంగా… 5 వేల క్యూసెక్కులు వరకు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఏలూరులో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి అని, స్థానిక వైద్య అధికారులను ఆయన ఆదేశించారు.