హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే పండుగ ఆఫర్లు..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ఇంటి నుండి బయటికి రావడానికే భయపడిపోతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరు సొంత వాహనాలను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. అయితే అలాంటి వారికీ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లు ప్రకటించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోకి వారు లక్ష్యంగా బ్యాంక్ పండుగ ఆఫర్లు తీసుకువచ్చింది. కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి లేదంటే బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి బ్యాంక్ అందిస్తున్న ఆఫర్లు పొందొచ్చు.

hdfc
hdfc

అయితే పండుగ ఆఫర్లలో భాగంగా బ్యాంక్ కస్టమర్లు పలు ప్రొడక్టులపై 5 శాతం నుంచి 15 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఇక పర్సనల్ లోన్, కార్ లోన్, ట్రాక్టర్ లోన్, గోల్డ్ లోన్, హోమ్ లోన్ వంటి వాటిపై కూడా ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి. అంతేకాదు రిటైల్, బిజనెస్ కస్టమర్లు ఇద్దరూ కూడా పండుగ ఆఫర్లు పొందొచ్చు. ఇక టూవీలర్ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా ఉంది. అయితే కేవలం రూ.1,999 డౌన్ పేమెంట్ చెల్లించి వెహికల్ ఇంటికి తీసుకెళ్లొచ్చు. అంతేకాదు ఇంకా 25 శాతం తక్కువ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు.

ఇకపోతే ఇది తొలి ఆరు నెలలకు ఇది వర్తిస్తుంది. అదే ట్రాక్టర్ లోన్ తీసుకుంటే ఫోర్ ‌క్లోజర్ చార్జీలపై 50 శాతం తగ్గింపు పొందొచ్చు. ట్రాక్టర్ కొనుగోలుకు 90 శాతం ఫైనాన్స్ లభిస్తుంది. ఇక అదే కస్టమర్లు గోల్డ్ లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం తగ్గింపు ఉంటుంది. కిసాన్ గోల్డ్ లోన్స్ ‌కు కూడా ఇది వర్తిస్తుంది. హోమ్ లోన్స్ ‌పై తక్కువ వడ్డీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని భావించే వారు బ్యాంక్‌ కు వెళ్లి ప్రయోజనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news