కూచిపూడి దిగ్గజం శోభానాయుడు బుధవారం ఉదయం హైదరాబాదు ప్రైవేటు ఆస్పత్రిలో కన్ను మూసారు. కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం గత కొంత కాలంగా నాడీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారట. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో 1956లో జన్మించిన శోభా నాయుడు గారు వెంపటి చిన సత్యం గారి వద్ద శిష్యరికం చేసారు. చిన్నతనంలోనే ఎన్నో వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. సత్యభామ, పద్మావతి గా ఆమె చేసిన ప్రదర్శనలు అనేకం ఉన్నాయి.
దేశ విదేశాల్లో కూచిపూడి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. కూచిపూడిలో చేసిన సేవలకి గాను భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. అలాగే మద్రాస్ శ్రీక్రిష్ణ గాన సభా వారు నృత్య చూడమణీ అనే అవార్డుతో సత్కరించారు. సంగీత్ నాటక్ అవార్డు అనే మరో అవార్డు ఆమె ఖాతాలో ఉంది. హైదరాబాద్ లోని కూచిపూడి ఆర్ట్ అకాడమీకి ప్రిన్సిపల్ గా పనిచేసారు.