డిజిటల్ క్రెడిట్ కార్డు.. రూ.2 లక్షల వరకు రుణం పొందే అవకాశం..!

-

ప్రస్తుతం అందరూ క్రెడిట్ కార్డును ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ వివిఫై ఇండియా పైనాన్స్ దేశంలో మొదటిసారిగా యూపీఐ ప్లాట్‌ఫాంపై రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫ్లెక్స్ పే పేరుతో యూపీఐ చెల్లింపుల ఆధారిత డిజిటల్ క్రెడిట్ కార్డును తీసుకువచ్చింది. అయితే ఈ కార్డును కస్టమర్లు వాళ్ళకి ఇచ్చిన లిమిట్ మేరకు ఫ్లెక్స్ పే యాప్ ద్వారా దగ్గరలోని దుకాణాలలో యూపీఐ క్యూఆర్ కోడ్, యూపీఐ ఐడీని స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అంతేకాకుండా కస్టమర్ కావాలనుకునే మొత్తాన్ని తన బ్యాంకు ఖాతాకు బదలీ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది.

ఈ కార్డు కావాలనుకునే వారికి చెక్ లిస్ట్ ఆధారంగా పదిహేను నిమిషాల్లో డిజిటల్ క్రెడిట్ కార్డు ఇస్తారు. ఇందుకు కాను కస్టమర్ యొక్క ఆదాయం, గతంలో తీసుకున్న రుణాలు, చెల్లింపు సామర్థ్యం, సిబిల్ స్కోర్, బ్యాంకు స్టేట్‌మెంట్ ఆధారంగా చూస్తారు. ఈ క్రెడిట్ కార్డు ద్వారా రూ.500 నుండి రూ.2 లక్షల వరకు క్రెడిట్ లిమిట్ పొందవచ్చు. ఇకపోతే వడ్డీ విషయానికి వస్తే క్రెడిట్ లిమిట్ బట్టి, వినియోగదారుడి వాడకాన్ని బట్టి వడ్డీ ఏడాదికి 36 శాతం వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని గరిష్టంగా 36 నెలల్లో చెల్లించాలి. ఉద్యోగులకు, వ్యాపారస్తులకు, స్వయం ఉపాధి పొందుతున్న వారికి రుణ సదుపాయం ప్రయోజనం కలిగిస్తుంది.

వ్యాలెట్, బ్యాంకు ఖాతాల్లో నగదు లేకపోయినప్పటికీ ఫ్లెక్స్‌పే ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు. ప్రధానంగా క్రెడిట్ కార్డులు లేని వారిని లక్ష్యంగా చేసుకొని ఫ్లెక్స్ పేను తీసుకొచ్చారు. స్కాన్ అండ్ పే లాటర్ విధానంలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు వివిఫై వ్యవస్థాపకులు, సీఈవో అనిల్ పినపాల అన్నారు. దేశంలో ఈ తరహా రుణ సౌకర్యం ఇచ్చే బ్యాంకు ఇదేనని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది దోహదపడుతుందన్నారు. తమ కస్టమర్లకు ఇది డిజిటల్ క్రెడిట్ కార్డుగా ఉపయోగపడుతుందన్నారు.

అలాగే క్రెడిట్ కార్డ్ సౌకర్యంలేని 30 కోట్ల మందికి ఇది ప్రయోజనకరమన్నారు. ఇప్పటికే ఉన్న 30వేల కస్టమర్ల ద్వారా ఈ రుణసౌకర్యాన్ని పరీక్షించామన్నారు. అయితే వచ్చే మూడేళ్లలో రూ.10వేలకోట్ల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందుకు కాను ముందుగా ఫ్లెక్స్ పే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత పాన్ కార్డు వివరాలు, వ్యక్తి గుర్తింపు వివరాలు నమోదు చేయాలి. ప్రాసెస్ అంతా అయ్యాక కంపెనీ ఏజెంట్ వీడియో కాల్ చేసి కస్టమర్ యొక్క పత్రాలను తనిఖీ చేసుకుని ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియ పదిహేను నిమిషాల్లో పూర్తవుతుంది. సిబిల్ స్కోర్ ఆధారంగా కస్టమర్ రుణానికి అర్హులా కాదా, అర్హులు అయితే ఎంత ఇవ్వవచ్చునో తెలుసుకుంటారు. నగదును ఉపయోగించుకున్న కాలానికే వడ్డీ చెల్లించాలి. మరి ఈ సదవకాశాన్ని కస్టమర్స్ ఉపయోగించుకుని బెనిఫిట్స్ పొందండి..!

Read more RELATED
Recommended to you

Latest news