ఇసుక కార్పోరేషన్ విధివిధానాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…!

-

తాడేపల్లిలో ఇసుక కార్పోరేషన్ ఏర్పాటు పై రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇసుక కార్పోరేషన్ విధివిధానాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. వినియోగాదారులు ఇసుకను పారదర్శకంగా, వేగంగా చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.

బ్లాక్ మార్కెట్‌లో ఇసుక విక్రయాలు జరగకుండా, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ఇసుక రీచ్‌ల్లో కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. నదుల్లో వరద తగ్గిన వెంటనే ఓపెన్ రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలను ముమ్మరం చేయాలని..ఇసుక లభ్యతపై ఆన్‌లైన్‌లో వినియోగదారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూడాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో మంత్రి కొడాలి నాని, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎపిఎండిసి విసి అండ్ ఎండి హరినారాయణ్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news