గ్రేటర్ లో ఆస్తుల ఆన్లైన్ సర్వే నిలిపివేత.. ఎందుకంటే ?

-

గ్రేటర్‌ లోని ఆస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే దిశగా జీహెచ్‌ఎంసీ టీమ్స్ పని చేస్తున్న సంగతి తెలిసిందే. దసరాకి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో ఆ లోపే ఆస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని అధికారులు రంగంలోకి దిగారు. ఈ నెల ఒకటో తారీఖు నుండి ఈ పని చేస్తున్నారు.

బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌‌స్పెక్టర్లతోపాటు ఎంటమాలజీ, శానిటేషన్, స్పోర్ట్స్ తదితర డిపార్ట్‌‌మెంట్ల ఔట్‌‌సోర్సింగ్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి నమోదు చేస్తున్నా ఈ నెల 10వ తేదీతో ముగించాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నప్పటికీ ఇప్పటి దాక సగం మ్యాపింగ్ కాలేదు. అయితే వరదల నేపథ్యంలో గ్రేటర్ లో ఆస్తుల ఆన్లైన్ సర్వేని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. జీహెచ్ఎంసీ లో వరదల సహాయక చర్యల అధికారులు పాల్గొంటున్న నేపథ్యంలో నిలిపివేసినట్టు చెబుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టాక సర్వే మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news