ఎమ్మెల్యే అభ్యర్థి ని ఐటం అన్నందుకు సీఎం ఏం చేశారో తెలుసా..?

-

ఇటీవలే మధ్యప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత కమల్నాథ్ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని దబ్రా నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనుండగా ఈ ప్రచార సభలో బీజేపీ అభ్యర్థి ఇమ్మార్తి దేవి పాల్గొన్నారు. ఇదే విషయంపై మాట్లాడిన కాంగ్రెస్ నేత కమల్నాథ్… తమ పార్టీ నేత ఒక సాదాసీదా వ్యక్తి అని కానీ బిజెపి అభ్యర్థి ఒక ఐటం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒక మహిళ అభ్యర్థిపై ఐటం అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబడుతూ బిజెపి తీవ్రస్థాయిలో మండిపడుతోంది.

ఈ క్రమంలోనే స్పందించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక మహిళ అభ్యర్థిని ఐటెం అంటూ వ్యాఖ్యానించడంతోనే కమల్నాథ్ మైండ్ సెట్ ఏంటో ప్రజలకు అర్థమవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా సహా మరి కొంత మంది నేతలతో కలిసి కమల్ నాథ్ వ్యాఖ్యలను నిరసిస్తూ మౌనదీక్ష చేపట్టారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.

Read more RELATED
Recommended to you

Latest news