చైనా కి చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమీ మొబైల్స్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా చైనాకి, ఇండియాకి మధ్య జరుగుతున్న ఘర్షణలు అందరికీ తెలిసిందే. బోర్డర్ ఇష్యూపై చైనా చేస్తున్న వింత వాదనలకి ఇండియా తనదైన రూపంలో బదులిస్తూ వస్తుంది. ఐతే షియోమీ మొబైల్స్ లో కనిపించే వెదర్ యాప్ లో అరుణా చల ప్రదేశ్ కనిపించకపోవడం అందరికీ షాక్ కలిగించింది.
భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న ఈటా నగర్ మొదలగు పట్టణాలు వెదర్ యాప్ లో కనిపించలేదు. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న నెటిజన్లు షియోమీ మొబైల్స్ పై దండెత్తారు. చైనా చేస్తున్న వింత వాదనలకి వంత పాడుతున్నట్టుగా షియోమీ మొబైల్స్ ప్రవర్తిస్తుందని, సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అలర్ట్ అయిన షియోమీ మొబైల్స్, వెంటనే సమస్యని గుర్తించి క్లియర్ చేసింది. సాంకేతిక సమస్యల కారణంగా ఇలా జరిగిందని, అంతే కానీ భారత భూభాగాలపై వివాదం చేయడానికి కాదని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం వెదర్ యాప్ అరుణాచల్ ప్రదేశ్ సహా అన్ని నగరాలు కనిపిస్తున్నాయి.