ప్లాస్మా థెరపీని ఆపేస్తాం: కేంద్రం

-

కరోన   రోగులకు చికిత్సగా ఉన్న ప్లాస్మా థెరపీని త్వరలోనే నిలిపివేయవచ్చని కేంద్రం మంగళవారం తెలిపింది. ఈ చికిత్సను దేశ వ్యాప్తంగా వాడుతున్నారు. ఆగస్టులో ఐసిఎంఆర్ నిర్వహించిన అతిపెద్ద రాండమైజ్డ్ ట్రయల్‌ లో ప్లాస్మా థెరపీ వలన ఉపయోగం లేదనే విషయం వెల్లడి అయింది. చికిత్స పొందిన రోగులలో ప్లాస్మా మరణాలు తగ్గించలేదు అని, తీవ్రత తగ్గించలేకపోయింది అని గుర్తించారు.

ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దీనిని త్వరలో నిలిపివేయవచ్చు అని పేర్కొన్నారు. “జాతీయ మార్గదర్శకాల నుండి ప్లాస్మా చికిత్సను తొలగించడానికి మేము ఉమ్మడి పర్యవేక్షణ బృందంతో చర్చిస్తున్నాము” అని డాక్టర్ భార్గవ మీడియాకు తెలిపారు. ఇక ప్లాస్మా కోసం బ్లాక్ మార్కెట్ కూడా ఇప్పుడు నడుస్తుంది. కొన్ని రాష్ట్రాలు ప్లాస్మా బ్యాంకులను కూడా ఏర్పాటు చేసాయి.

Read more RELATED
Recommended to you

Latest news