ఏపీలో ఒకే రోజు రెండు లైంగిక వేధింపుల కేసులు బయట పడ్డాయి. అది కూడా ఇద్దరూ వైసీపీ నాయకులకి సంబందించినవె కావడం గమనార్హం. తూగో జిల్లా పెద్దాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనిలో దారుణం చోటు చేసుకుంది. ఒరిస్సాకు చెందిన మహిళపై కట్టమూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రంగనాదం అత్యాచారయత్నం చేశాడు. పెద్దాపురం సమీపంలోని రొయ్యల పరిశ్రమలో బాధితురాలు పని చేస్తోంది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమాదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మీద కేసు నమోదైనప్పటికి కట్టమూరులో జరిగిన అక్షరభ్యాసం కార్యక్రమంలో నిందితుడు పాల్గొనడంతో పోలీసుల తీరుపై పలు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండే అనంతలో మరో వైసీపీ నేత మన్సూర్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది.
యాసిడ్ పోసి.. గొంతు కోసి చంపుతానంటూ మహిళను బెదరించినట్టు ఆమె ఆరోపిస్తోంది. భర్తను పొగొట్టుకున్నావ్.. ఇంకా ఎవరినైనా పోగొట్టుకోవాలనుకుంటున్నావా అంటూ హెచ్చరిస్తున్నారని బాధితురాలు సల్మా ఆరోపిస్తోంది. పోలీసుల సమక్షంలోనే పర్సనల్ ఫోటోలు సామాజిక మాద్యమాల్లో పెడతానంటూ బెదరిస్తున్నాడని ఆమె ఆరిపిస్తోంది. మేం పులివెందుల వాళ్లం.. మమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు.నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆమె ఆరోపిస్తోంది. పంచాయతీ కోసం వైసీపీ నేత వద్దకు వెళ్లిన తనను వైసీపీ నేత మన్సూర్ లొంగదీసుకున్నాడని, నీ పిల్లలను చూసుకుంటాను అని మాయమాటలు చెప్పి ఇప్పుడు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు.. విషం తాగి చనిపోమని చెబుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.