ఒకే రోజు ఏడు మర్డర్ కేసులు.. 16 ఏళ్లగా మోస్ట్ వాంటెడ్.. దొరికేశాడు !

-

16 ఏళ్లగా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన రౌడీషీటర్ డేవిడ్ రాజును ఎస్సార్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. గత పదహారు సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్ డేవిడ్ రాజును కృష్ణ జిల్లాకి వెళ్ళిన ఎస్సార్ నగర్ స్టేషన్ కు చెందిన పోలీసుల టీమ్ అరెస్ట్ చేసింది.

గతంలో ఎర్రగడ్డలో ఒకటే రోజు జరిగిన ఏడు హత్య కేసులో డేవిడ్ రాజు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసు ఒక్కటే కాక ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లతో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఈ డేవిడ్ రాజు మీద 1991 నుంచి కేసులు నమోదయి ఉన్నాయి. ఇక ఈయన్ని హైదరాబాద్ తీసుకురానున్న పోలీసులు కోర్టు ముందు ప్రవేశ పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news