పండుగ శుభవార్త.. రుణ గ్రహీతలకు తీపికబురు అందించిన మోదీ కేంద్ర ప్రభుత్వం.

-

కేంద్ర ప్రభుత్వం పండుగ నేపథ్యంలో ఒక తీపికబురు అందించనుంది. మోదీ ప్రభుత్వం లోన్ తీసుకున్న వారికి శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది. అతి ముఖ్యంగా లోన్ మారటోరియం ప్రయోజనం పొందిన వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించబోతోంది. వడ్డీ మీద వడ్డీ మాఫీ నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వం. పండుగకు ముందే ఈ తీపికబురు అందొచ్చు. రుణ గ్రహీతలకు పండుగ కానుకగా కీలక ప్రకటన ఇవ్వబోతున్న కేంద్ర ప్రభుత్వం.

money
money

ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో లోన్ మారటోరియం అంశం పై ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన రుణాలపై వడ్డీ మాఫీ అంశంపై మోదీ సర్కార్ ఒక కీలక నిర్ణయానికి వచ్చిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. లోన్ మారటోరియం అంశం సుప్రీం కోర్టులో ఉండటమీ ఇందుకు గల ముఖ్య కారణం. కేంద్ర క్యాబినెట్ పలు రుణాలపై వడ్డీ మీద వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపిందని పలు వర్గాలు పేర్కొంటున్నాయి. రూ.2 కోట్ల వరుకు ఉన్న రుణాలకు ఇది వర్తిస్తుంది. సుప్రీం కోర్టు అక్టోబర్ 14న కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కానీ, మోదీ సర్కార్ మాత్రం నెల రోజుల గడువు కోరింది. అయితే సుప్రీం కోర్టు నిర్ణయాన్ని అమలు చేయడానికి నెల రోజుల గడువు ఎందుకని ప్రశ్నించింది. అయినా కేంద్రం మాత్రం గడువు కోరింది. ఇకపోతే నవంబర్ 2లోపు కేంద్రం తమ నిర్ణయాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దసరా పండుగ కల్లా లోన్ తీసుకున్న వారికి ఊరట కలిగించే తీపికబురు అందించవచ్చు.లోన్ తీసుకున్న వారికి ఇది బెనిఫిట్. లోన్ తీసుకుని, ఈఎంఐ మారటోరియం బెనిఫిట్ పొందే వారికి కేంద్ర ప్రభుత్వం పండుగ కన్న ముందే తీపికబురు అందించబోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news