దేశ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత క్రమంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. విమాన ప్రయాణాల విషయంలో కరోనా నిబంధనలకు లోబడి నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాలు వారానికి ఎన్ని ఉండాలో నిర్ణయించింది.
దేశీయ శీతాకాలపు షెడ్యూల్ కోసం 25 అక్టోబర్ 2020 నుండి 20 మార్చి 2021 వరకు 95 విమానాశ్రయాలను కవర్ చేయడానికి వారానికి 12,983 నిష్క్రమణలు ఖరారు చేసింది. 2019-20 శీతాకాలంలో వారానికి 23,307 నిష్క్రమణలు ఉండేవి అని… ఇప్పుడు 44.3% తగ్గిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటనలో చెప్పింది.