ఉమ్మడి వరంగల్ జిల్లాలకు ఆదివారం టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే అక్టోబర్ నెలలో ప్రతి ఆదివారం మావోయిస్ట్ లకు సంబంధించి ఏదో ఒక పెద్ద సంఘటన జరగడంతో ఆదివారం వస్తుంది అంటే చాలు ములుగు జిల్లా వాసులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు కూడా ఏమవుతుందో అని వణికిపోతున్నారు. ఏ రోజున ఏమి దుర్వార్థ వినాల్సి వస్తుందో అని అక్కడి వాసులు హడలిపోతున్నారు. అక్టోబర్ 4, 14,18, 25 ఇలా నాలుగు ఆదివారాల్లో నాలుగు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ముందుగా మావోల కట్టడికి పోలీసు అధికారులు అక్టోబర్ 4న ములుగు జిల్లా వాజేడు వెంకటపూర్ లో కేంద్ర పోలీసు అధికారులతో పాటు నాలుగు రాష్ట్రాల పోలీసు అధికారులతో మీటింగ్ పెట్టారు. అప్పటి నుండి మావోయిస్ట్ లు జిల్లాని టార్గెట్ చేశారు అధికారులు. అప్పటి నుండి సమాచారం కోసం ఇటు పోలీసులు అటు మావోయిస్టులు ఏజెన్సీ గ్రామాల వారిని అనుమానిస్తుండడంతో అటవీ గ్రామాల్లోని ప్రజలు ఎప్పుడు ఏమవుతుంది ఎప్పుడు ఎవరు తమని టార్గెట్ చేస్తారో అని భయంతో కాలం గడుపుతున్నారు.