పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నచందంగా కొన్ని రాజకీయ పార్టీల వ్యవహారాలు ఉంటుంటాయి! ఇప్పుడు ఆ లిస్ట్ లో జనసేన కూడా వచ్చి చేరబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి! నిన్నమొన్నటివరకూ జాతీయ పార్టీ అని చెప్పుకున్న టీడీపీ కూడా గట్టిగా మాట్లాడితే ఏపీలో మాత్రమే ఉంది.. తెలంగాణ ఆ పార్టీ మనుగడ అంతంతమాత్రమే!! అయితే ఆ లిస్ట్ లో చేరిపోబోతుంది జనసేన!
అవును… తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ పవన్ కు ఫ్యాన్స్ పుష్కలంగా ఉన్నారు! రెండు చోట్లా జనసేన పార్టీకి సంబందించిన కమిటీలు కూడా ఉన్నాయి.. కార్యకర్తలు ఉన్నారు. అయినా కూడా తెలంగాణలో పోటీ అన్నా.. మిత్రుడు బీజేపీతో కలిసి ప్రచారం అన్నా కూడా పవన్ వణికిపోతున్నారు!! ప్రస్తుతం ఈ విషయమే తెలంగాణలోని జనసేన కార్యకర్తలను నిరుత్సాహపరుస్తుంది!
జాతీయ పార్టీతో జతకట్టి సబ్ రీజనల్ సహకారం మాత్రమే ఇస్తాను అన్నట్లుగా పవన్ ప్రవర్తించడంపై అటు బీజేపీ కార్యకర్తలు కూడా కాస్త కారాలూ మిరియాలూ నూరుతున్నారని అంటున్నారు! గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి.. దుబ్బాక ఉప ఎన్నిక ఉంది.. ఆ రెండు చోట్లా బీజేపీ పోటీచేస్తుంది.. అయినా కూడా జనసేన అక్కడ మద్దతు ఇవ్వడం లేదు!
అలా అని జనసేన తెలంగాణలో సొంతంగా ఏమీ పోటీ చేయడం లేదు.. కేవలం ప్రేక్షక పాత్ర మాత్రమే వహిస్తోంది. ఇదేమి రాజకీయరా నాయనా అనుకున్నవారికి మాత్రం తెలంగాణలో ఆ రెండు ఎన్నికలూ పూర్తయిన తర్వాత జనసేనాని నుంచి సమాధానం రావొచ్చు! మే బీ “వ్యక్తిగత” వ్యూహాత్మక నిర్ణయం అని!
సో ఇకపై తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలు.. పవన్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి తప్ప.. ఎంత మిత్రపక్షమైనా ఒత్తిడి తీసుకురావడానికి వీలు లేదు. అయినా ఒత్తిడి తీసుకురావడం ఏమిటి? అది పవన్ బాధ్యత కదా! అయినాసరే… పవన్ ఇచ్చినంత మాత్రమే తీసుకోండి బీజేపీ నేతలు!