తెలంగాణ రాష్ట్ర తొలిహోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి కొద్ది రోజుల క్రితం కన్నుమూశారన్న సంగతి తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే దాని నుంచి కోలుకున్నా ఆ తర్వాత ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షెన్ సోకింది. ఓ అర్ధరాత్రి సమయాన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచినట్లుగా వైద్యులు వెల్లడించారు.
అయితే ఆయనతో పాటే ఆయన భార్య అహల్య కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన అంత్యక్రియల కోసం కూడా ఆమె భర్తను చూసేందుకు వీల్ ఛైర్ లో వచ్చారు. భర్తను కడసారి చూసేందుకు హాస్పిటల్ నుండి మినిస్టర్ క్వార్టర్స్ కు ప్రత్యేక అంబులెన్స్ లో ఆమెను తీసుకువచ్చారు కుటుంబసభ్యులు. అయితే ఆమె కూడా కొద్ది సేపటి క్రితం చికిత్స పొందుతూ అపోలో ఆసుపత్రిలోనే మృతి చెందింది.