ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్లో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్ దేవరకొండ తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ లు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారు అంటూ ప్రశంసించాడు.
తమ జిల్లాతో పాటు అన్ని జిల్లాలకు కూడా తాగునీరు అందడంతో పాటు 24 గంటల విద్యుత్ అందుతుంది అంటూ ప్రశంసించాడు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజల సమస్యలు సత్వరంగా పరిష్కారమవుతున్నాయని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. పరిశ్రమలు బాగా రావడంతో పాటు నిరుద్యోగత కూడా తగ్గిపోతుంది అంటూ విజయ్ దేవరకొండ తెలిపారు. ఇక ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ ద్వారా హైదరాబాద్లో లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది అంటూ విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించాడు.