సీకే నాయుడు… ఈ తరం వాళ్లకు ఈ పేరు కూడా తెలియదు. ఇండియన్ టెస్ట్ క్రికెట్ ని తొలి రోజుల్లో పరుగులు పెట్టించిన క్రికెట్ దిగ్గజం. నేడు ఆయన జన్మదినం. ఇదే రోజు 1895లో ఆయన జన్మించారు. ఆయన ఇండియన్ టీం కి మొదటి టెస్ట్ కెప్టెన్. పద్మభూషణ పురస్కారం అందుకొన్న తొలి క్రికెట్ ఆటగాడు ఆయనే. 1933లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అందుకున్నారు.
1955లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో రెండు దశాబ్దాలు (1916-1936) నాయుడు యుగంగా చెప్తారు. రిటైర్ అయ్యాక కొన్నాళ్ళు జట్టు సెలెక్టర్ గా, రేడియో వ్యాఖ్యాతగా ఆటతో తన అనుబంధం కొనసాగించారు. ఈయన 1967, నవంబర్ 14న ఇండోర్‌లో మరణించారు. నలభై ఎనిమిదేళ్ళ సుదీర్ఘ ఫస్ట్ క్లాసు కెరీర్ లో సి.కె. నాయుడు ఎన్నో రికార్డ్ లు సాధించారు.