సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ (జేడీ) లక్ష్మీ నారాయణ నూతన పార్టీ స్థాపన దిశగా ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో లోక్సత్తా నుంచి ఆహ్వానం రావడంతో ఆయన లక్ష్మీనారాయణ స్పందనపై కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా… ‘లోక్సత్తా నియంత, తన పార్టీని ఇప్పటిదాకా పార్టీలో కష్టపడినవాళ్ళకి కాక.. పైనుంచి ఊడిపడిన జేడీకి సగర్వంగా ధారాదత్తం చేసినటువంటి కమనీయ దృశ్యాన్ని చూసి తరించి హర్షించిన జనులందరికీ నా హర్షాతిరేకాలు తెలియజేస్తూ, సంభ్రమాశ్చర్యాలకి గురవుతున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు.