కరోనా కంటే డేంజర్ వైరస్ మరొకటి ఉంది : చంద్రబాబు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కంటే అంతకంటే ఎక్కువ పట్టిపీడిస్తున్న జగన్ వైరస్ ఎంతో ప్రమాదకరం అంటూ ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇటీవలే పార్టీ సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు నాయుడు… ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ తీరుపై అనుసరిస్తున్న ప్రణాళికల పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్లో 175 నియోజక వర్గాల ఇన్చార్జిలు టీడీపీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా వైరస్ ని మించిన వైరస్ జగన్మోహన్ రెడ్డి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబునాయుడు. ఫేక్ న్యూస్ ని నిజాలుగా చూపి ప్రజలను నమ్మించ గల ఘనుడు సీఎం జగన అని విమర్శించారు. అంతేకాకుండా కుల మత విద్వేషాలను రగిలించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విదంగా కూడా జగన్ ఎంతో ఆరితేరాడు అంటూ చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ మంచి వాళ్ళ పై బురద జల్లడం సర్వసాధారణంగా మారిపోయింది అని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news