అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ మధ్య హోరాహోరీ కొనసాగుతోంది. వరుసగా రెండోసారి దేశాధ్యక్ష పీఠాన్ని హస్తగతం చేసుకోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతుండగా ఈసారి గెలిచి శ్వేతసౌధంలో అడుగుపెట్టాలని బైడెన్ ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఎనిమిది రాష్ట్రాల్లో ఇద్దరికీ చేరిసమంగా స్థానాలు వస్తున్నాయి. ఇక ఈ సందర్భంగా ట్రంప్ కీలక ట్వీట్ చేశారు.
పోలింగ్ ముగిశాక వేసే ఓట్లు చెల్లవని, సీట్లు కొల్లగొట్టాలనే డెమోక్రాట్ల ప్రయత్నాలు ఫలించవని మనదే భారీ విజయమని అయన ట్వీట్ చేశాడు. అమెరికన్లు అందరికీ నా ధన్యవాదాలు అంటూ పేర్కొన్న ట్రంప్ నార్త్ కరోలినాలో ఘన విజయం సాధించాం, కోట్లాదిమంది ఉన్న టెక్సాస్లో మనమే గెలిచాం నాకు మద్దతు తెలిపిన అమెరికన్లు అందరికీ కృతజ్ఞతలు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై కుట్ర జరుగుతోందన్న అయన సుప్రీం కోర్టుకు వెళతామని పేర్కొన్నారు.