ఆ ఒక్క క్యాచ్ మిస్ కాకుంటే.. కథ మరోలా ఉండేది.. ఓటమిపై కోహ్లీ.!

-

ఐపీఎల్ సీజన్ లో ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ జట్టు అంచనాలకు తగ్గట్టుగానే ఆడుతూ ప్లే ఆఫ్ వరకు చేరిన విషయం తెలిసిందే. అయితే నిన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పేలవ ప్రదర్శన చేసి చివరికి ఓటమి చవిచూసి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ప్లే ఆప్ కి వెళ్ళిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి కప్పు గెలుస్తుంది అని ఎంతో నమ్మకంతో ఉన్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.

అయితే ఇటీవలే నిన్నటి ఓటమిపై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో తాము తగినన్ని పరుగులు చేయలేక పోయాము అంటూ ఒప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మంచి ఫామ్ లో ఉన్న కేన్ విలియమ్సన్ ఒక షాట్ ఆడగా.. ఆ షాట్ ని పడిక్కాల్ అందుకోలేకపోయాడని ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ స్వరూపం వేరేలా ఉండేది అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news