ఆడ బిడ్డ కోసం పదిహేను సార్లు గర్భం దాల్చింది.. చివరికి..!

సాధారణంగా ఆడ పిల్లలు పుట్టినప్పుడు ఎక్కువగా మగబిడ్డ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు దంపతులు. ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఘటనలు తెర మీదికి రావడం ఎన్నో చూసాము. కానీ ఇక్కడ ఒక దంపతుల రూటే సపరేటు… వరుసగా మగపిల్లలు పడుతున్నప్పటికీ సంతృప్తి చెందకుండా తమకు ఎట్టిపరిస్థితుల్లో ఆడపిల్ల కావాలి అనే ఉద్దేశంతో ఏకంగా 15 సార్లు పిల్లలను కనేందుకు ప్రయత్నించారు ఇక్కడ దంపతులు. ఏకంగా ఇక్కడ ఒక మహిళా 15 గర్భవతి కాగా 15వ సారి ఆడపిల్ల పుట్టింది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

 

అమెరికాలో ఈ ఘటన జరిగింది. అమెరికాలోని మిచిగాన్ కి చెందిన జాయ్, కతేరు దంపతులకు ఆడపిల్ల అంటే ఎంతో ఇష్టం. కానీ వారికి మొదటి కాన్పులో అబ్బాయి జన్మించాడు. దీంతో ఆడపిల్ల కోసం మరోసారి ప్రయత్నించారు. ఆ తర్వాత కూడా అబ్బాయే . ఇలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఏకంగా 15 సార్లు పిల్లలు కనేందుకు ప్రయత్నించారు సదరు దంపతులు. 14 సార్లు ఏకంగా మగ పిల్లలు పుటగా 15వ సారి వారి కోరిక నెరవేరింది. ఆడపిల్ల పుట్టింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.