రాయ్ లక్ష్మి ఇంట తీవ్ర విషాదం..

-

సినీ హీరోయిన్ రాయ్ లక్ష్మి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి రాయ్‌ రామ్‌ నిన్న రాత్రి అనారోగ్య కారణాలతో కన్ను మూశారు. అయితే తన తండ్రిని బతికించుకోలేకపోయానంటూ ఆమె సోషల్‌ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఇకలేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని లక్ష్మి భావోద్వేగానికి గురయింది.

నాన్నా. ఐ మిస్‌ యూ.. నేను ఈ బాధను దిగామింగుకోలేను, మీరు లేని ఈ లోటుతోనే జీవించేందుకు ప్రయత్నిస్తా, మీరు నన్ను ప్రేమించినట్లు మరెవరూ ప్రేమించలేదు. అని ఆమె చెప్పుకొచ్చింది. తెలుగులో కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగులో సినీ ఎంట్రీ ఇచ్చిన ఈమె, చివరిగా గత ఏడాది వేర్ ఈజ్ వెంకట లక్ష్మి సినిమాతో పలకరించింది. ఆమె నటిస్తోన్న ఆనంద భైరవి సినిమా సెట్స్ మీద ఉంది. ఆమె మరిన్ని తమిళ, కన్నడ, మళయాలం సినిమాల్లో నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news